ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా..? బిగ్ టర్నింగ్ ఎలిమినేషన్

Saturday, August 24th, 2019, 03:55:17 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనే దాని గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ వారం ఎలిమినేషన్ కోసం రాహుల్, హిమజ,మహేష్,శివజ్యోతి,బాబా భాస్కర్,పునర్నవి అషు రెడ్డి ఉన్నారు. వీళ్లల్లో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అషు రెడ్డికి,రాహుల్, హిమజకి ఉన్నాయి. నిన్నటి ఓటింగ్ ప్రకారం చూసుకుంటే హిమజ, అషు రెడ్డి ఓటింగ్ లో డేంజర్ జోన్ ఉన్నారు.

వీళ్ళలో ఎక్కువగా అషు రెడ్డి ఈ వారం హౌస్ నుండి వెళ్లిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. హిమజ అషు ఇద్దరిలో హౌస్ లో కొంచం ఎంగేజ్ చేస్తుంది హిమజ. తప్పో కావచ్చు ఒప్పో కావచ్చు, ప్రస్తుతానికి హౌస్ లో హిమజ వలన బిగ్ బాస్ కి కొంచం ఫుటేజీ వస్తుంది, అషు వలన కనీసం అది కూడా రావటం లేదు. టాస్క్ ల విషయంలో కావచ్చు, దేని గురించి అయిన మాట్లాడే విషయంలో కావచ్చు అషు రెడ్డి అంతగా ఎఫెక్ట్ చూపించటం లేదు .

ఆమె హౌస్ లో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అనే మాటలు బాగా వినవస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని కూడా బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ అనేది ఉంటుంది. అలాగే ఈ వారం హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తుంది, ప్రస్తుతం హౌస్ లో ఉన్న వాళ్ళు సరిగ్గా ఎంగేజ్ చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని పరిగణంలోకి తీసుకోని వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఒక మేల్ కాంటిస్టెండ్ ని పంపించే అవకాశాలు ఉన్నాయి.