బిగ్ బాస్ 3 : కంటతడి పెట్టిన బాబా భాస్కర్

Monday, August 19th, 2019, 11:19:46 PM IST

‘బిగ్ బాస్3’… ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని మరీ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ కార్యక్రమం ప్రేక్షకుల్ని మాత్రం ఒక రేంజ్ లో అలరిస్తుందని చెప్పాలి. ఈ ఇంటిలో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరూ కూడా ఒకరిని ఒకరు టార్గెట్ చేస్తూ ఆడుకుంటున్నారు కూడా… అయితే వారాంతం వస్తే చాలు ఇక ఈ ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే టెన్షన్ అందరిలో కూడా కనిపిస్తుంది. ఇకపోతే వారం మొదలు వచ్చే సరికి నామినేషన్ ప్రక్రియలతో రోజు కూడా అందరి మధ్యన ఒకరకమైన గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈవారం నామినేషన్ చేయాల్సిన వారికి ఎరుపు రంగు పూయాల్సిందిగా బిగ్ బాస్ కొత్త రకమైన ఆలోచనకు తెరతీశారు. కాగా ఈ నామినేషన్లో భాగంగా ఈ ఇంటి సభ్యురాలైనటువంటి పునర్నవి అందరిని ఆశ్చర్యపరుస్తూ, ఎవరు ఊహించని విధంగా రాహుల్ ని నామినేట్ చేసింది.

దానితో పాటే ఈ ఇంటి లోని సభ్యులందరు కూడా అందరు కలిసి రాహుల్ ని టార్గెట్ చేశారు. ఇకపోతే హిమజ, పునర్నవి మధ్య ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒక చిన్నపాటి గొడవ కూడా జరిగిందని చెప్పాలి. అయితే కొందరు మాత్రం బాబా భాస్కర్ ని నామినేట్ చేసినట్లు తెలుస్తుంది. కాగా తనని నెలిమినేషన్ కి నామినేట్ చేశారని తెలుసుకున్న బాబా భాస్కర్ మాత్రం కంటతడి పెట్టుకుంటున్నాడు. కాగా కొద్దీ సేపటి క్రితం విడుదలైనటువంటి ఈ ప్రోమో ప్రస్తుతానికి వైరల్ గా మారిందని చెప్పాలి. అయితే తనని నామినేట్ చేసిన వారు దానికి గల కారణాన్ని వివరించినందుకు అంతలా కంటతడి పెట్టుకున్నారా లేక మరేదైనా కారణం ఉండ అనేది ప్రస్తుతానికి ఒక ప్రశ్నగా మారిందని చెప్పాలి.