బిగ్ బాస్ 3 : ఈసారి విజేత ఎవరో తెలుసా…?

Friday, October 18th, 2019, 10:51:10 PM IST

బిగ్ బాస్ సీజన్ 3 ఇక చివరి దశకు చేరుకుందని చెప్పాలి. కాగా ఇప్పటివరకు ఉన్నటువంటి ఏ ఇంటి సభ్యుల మధ్యన గట్టి పోటీకూడా ఉందన్న సంగతి మనకు తెలిసిందే. కాగా వీరిలో ఇక ఈ బిగ్ బాస్ సీజన్ మూడవ టైటిల్ ఎవరు గెలుచుకుంటారో అని అందరు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే టైటిల్ రేసులో మాత్రం శ్రీముఖి, రాహుల్, వరుణ్ ఉన్నారని ప్రచారం జోరుగా జరుగుతుంది. కానీ ఇది ఎంత వరకు నిజం అనేది మాత్రం ఎవరికీ ఒక స్పష్టత లేదని చెప్పాలి. అయితే ఒకరకంగా చూసుకుంటే ఈ షో నుండి ఎలిమినేట్ అయి, మళ్ళీ హౌస్ లోపలి వచినటువంటి అలీ రెజా కూడా టైటిల్ రేసులో ఉన్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కానీ అలీ మాత్రం టైటిల్ రేసులో ఎట్టిపరిస్థితుల్లో ఉంటాడు అని బిగ్ బాస్ స్పష్టం చేశారని సమాచారం. ఎందుకంటేఒకసారి ఇంటి నుండి బయటకు వెళ్లి మళ్ళీ వచ్చినటువంటి వారికీ టైటిల్ పొందే అవకాశం లేదని నిర్వాహకులు అంటున్నారు. కాగా అలీ రెజా మరియు బిగ్ బాస్ మధ్యన ఈ విషయంలో ఒక ఒప్పందం కూడా కుదిరిందని ప్రచారం జరుగుతుంది. అయితే బిగ్ బాస్ టైటిల్ రేసు మిడ్ ఆశలు వొదులుకుంటేనే హౌస్ లోకి రీ ఎంట్రీ ఉంటుందని, ఈ ఒప్పందానికి ఒప్పుకుంటేనే అలీ రెజా ని మళ్ళీ హౌస్ లోకి పంపించారని ప్రచారం జరుగుతుంది. అందుకనే అలీ మళ్ళీ ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా ఇదివరకు లా ఆడటం లేదని, ఎదో మొక్కుబడిగా తన టాస్కులను ఫినిష్ చేస్తున్నాడని సమాచారం.