బిగ్ బాస్ 3 : పునర్నవి కోసం రాహుల్ అలా చేశాడా…?

Monday, September 16th, 2019, 11:55:47 PM IST

బిగ్ బాస్ మూడవ సీజన్ లో అందరు కూడా చాలా రకాల పట్టింపులకు పోతున్నారు. కానీ వారు చేసే చేష్టలకు చూసే ప్రతి ప్రేక్షకుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. కాగా ఈసీజన్ లో కొత్తగా మొదలైన ప్రేమ జంట అంటే రాహుల్ మరియు పునర్నవి అని అందరికి తెలుసు. కాగా వీరిద్దరి మధ్యన వచ్చే సన్నివేశాలు అన్ని కూడా ప్రేక్షకులకు రెట్టింపు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కానీ కేవలం పాపులారిటీ కోసమే వీరు ఇలా చేస్తున్నారని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ వారానికి నామినేషన్ లో పునర్నవి పేరు వచ్చింది. కానీ ఈ షో నుండి పునర్నవి వెళ్లకుండా ఉండాలంటే మాత్రం ఒక పని చేయాలనీ బిగ్ బాస్ రాహుల్ కి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు…

కాగా పునర్నవి కోసం రాహుల్ 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగాలని, ఆలా తాగితే పునర్నవి ని ఎలిమినేషన్ నుండి తప్పిస్తానని బిగ్ బాస్ చెప్పారు. అది విన్న రాహుల్ వెంటనే అంగీకారం తెలిపారు. అందుకోసం తాను 20గ్లాసుల కాకరకాయ జ్యూస్ ని అలవోకగా తాగేశాడు రాహుల్. కాగా చివరి గ్లాస్ పూర్తి చేసిన రాహుల్ కి పునర్నవి గట్టిగ హత్తుకుని, రాహుల్ బుగ్గపై ముద్దు పెట్టింది. అంటే వీరి ప్రేమ మీద వస్తున్నటువంటి వార్తలు నిజమనే అనుకోవచ్చు.