బిగ్‌బాస్ 3 : కిచెన్ లో రచ్చ చేసిన హిమజ…

Friday, August 23rd, 2019, 01:05:20 AM IST

బిగ్‌బాస్ ఇంటిలో రోజుకో రచ్చ జరుగుతుంది… ఈ ఇంటిలో పార్టీసిపెంట్స్ గా ఉన్నటువంటి వారు ఎలా ఇబ్బంది పడుతున్నారో తెలియదు కానీ, వారందరిని చేస్తున్నటువంటి ప్రేక్షకులందరూ మాత్రం రోజు పండగ చేసుకుంటున్నారని చెప్పాలి… చెప్పాలంటే ఈ ఇంటిలో ప్రస్తుతానికి ఒకరంటే ఒకరికి అసలే పడటం లేదు… ముఖ్యంగా అలీ రెజా, మహేశ్ విట్టాకు అస్సలు పడటం లేదు. వీరిద్దరి మధ్యన ఎప్పటికి కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి… అయితే వారిద్దరి మధ్య జరిగే గొడవలు అన్ని కూడా చాలా తీవ్రంగా మారుతున్నాయి. అయితే ఈ ఇంటిలో ప్రస్తుతానికి కెప్టెన్ గా ఉన్నటువంటి శివజ్యోతితో పాటు ఇంటి సభ్యులందరు కూడా ప్రయత్నించినప్పటికీ కూడా వారి గొడవలు మాత్రం సద్దుమణగడం లేదనే చెప్పాలి…

ఇకపోతే రేపటికి సంబందించిన ప్రోమో మరింత రసవత్తరంగా కనిపించింది. అయితే ఈ ప్రోమోలో హిమజ ఆమ్లెట్ తింటూ కనబడింది. కాగా ఆమెని ఈ సహా కంటెస్టెంట్లు అయిన బాబా భాస్కర్ మరియు మరికొందరు ఇంటి సభ్యులు హిమజాను కామెంట్స్ చేస్తూ కనిపిస్తారు. అయితే వారి కామెంట్స్ కి హిమజకి పట్టలేనంత కోపం వచ్చింది. దీంతో ఒక్కసారిగా తన చేతిలో ఉన్న ఆమ్లెట్‌ను ప్లేట్‌తో సహా విసిరేసింది. అక్కడితో ఆగకుండా వెంటనే కిచెన్‌లోకి ఎగ్స్ ట్రే ని నేలకేసి కొట్టగా గుడ్లన్నీ కూడా పగిలిపోయాయి… తనను తినకుండా చేసినందుకు…ఇంట్లో కూడా ఎవరూ తినకూడదని గట్టిగా అరిచేస్తుంది. కాగా హిమజ నిజంగా ఇలా సీరియస్ అయిందా లేఖ ఇదంతా టాస్క్ లో భాగమా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.