బిగ్ బాస్ 3 : ఆహ్లాదకరంగా సాగిన ఇవ్వాల్టి ఎపిసోడ్…

Saturday, September 14th, 2019, 02:19:43 AM IST

బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ మధ్యన రోజుకొక గొడవలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈరోజు జరిగినటువంటి ఐసోడె లో మాత్రం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది ఈ బిగ్ బాస్ ఇంటిలో. దానికి తోడు సభ్యుల మధ్యన కూడా చాలా ఆనందాలు వెల్లువెత్తాయి. దానికి కారణం బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్కులే అని తెలుస్తుంది. కాగా ఇవ్వాల్టి ఎపిసోడ్ లో బిగ్ బాస్, బాబా భాస్కర్ ని సీక్రెట్ రూమ్‌కి పిలిచాడు.అయితే లోపల కొన్ని తినుబండారాలను ఏర్పాటు చేశారు. అవన్నింటిని తిన్న తరువాత కూల్ డ్రింక్ ఇచ్చారు. అయితే దాని తరువాత 1 నుండి 100 వరకు అంకెలను లెక్కబెట్టమని చెప్పారు. దాని తరువాత వాటిని వెనకకు లెక్కించమని చెప్పారు. అది పూర్తవగానే ABCD లు చదవమని చెప్పగా, తనకి రావు అని బాబా భాస్కర్ చెప్పారు. కాగా ఇవన్నీ కూడా కొంచం తడబడుతూనే చెప్పాడు బాబా భాస్కర్.

ఇకపోతే మరొక ఇంటిసభ్యులైన పునర్నవి, శివజ్యోతిలకు కూడా బిగ్ బాస్ కొన్ని ఫన్నీ టాస్కులను ఇచ్చారు. కాగ్ జ్యోతిని కొన్ని తెలుగు పద్యాలూ చెప్పుమనగా చాలా వరకు తడబడింది. ఇకపోతే పునర్నవిని నర్సరీ రైమ్స్ చెప్పామన్నారు బిగ్ బాస్… వీటన్నింటి తరువాత మరొక కంటెస్టెంట్ అయిన రాహుల్ తో 100 గుంజీలు తీయించి 10 డ్రింక్స్ తాగాలని ఆదేశించారు. మొత్తానికైతే ఇవ్వాల్టి ఎపిసోడ్ మాత్రం ఎలాంటి గొడవలు జరగకుండా ఆనందంగా జరిగిందని చెప్పాలి.