బిగ్ బాస్ 3 : మహేష్ విట్టా వెళ్ళిపోతున్నాడా – అసలు ఇంట్లో ఏం జరుగుతుంది…?

Friday, September 13th, 2019, 09:49:57 PM IST

బిగ్ బాస్ మూడవ సీజన్ చాలా రసవత్తరంగా జరుగుతున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. కాగా ఈ బిగ్ బాస్ ఇంటిలో గొడవలు ఎన్ని రకాలుగా జరిగినప్పటికీ కూడా, ఇది చూసే వారికి మాత్రం చాలా శారద సరదాగా జరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఇకపోతే తాజగా ఈ ఇంటిలో ఒక ఆకస్మిక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఇంటిలోకి వచ్చినప్పటినుండి కూడా అందరితో శారద సరదాగా ఉంటున్నటువంటి మహేష్ విట్టా ఒక్కసారిగా తన బట్టలు అన్ని కూడా సర్దుకొని మరీ బయటకు వెళ్లిపోయేందుకు సిద్దమయ్యాడు. అంతేకాకుండా తన బాగ్ ని తీసుకోని బయట ఎగ్జిట్ గేట్ వరకు రావడాన్ని, లేటెస్ట్ గా విడుదల చేసినటువంటి ప్రోమోలో చూడవచ్చు.

అయితే ఆలా ఎందుకు చేస్తున్నావని మహేష్ విట్టా ని మరొక కంటెస్టెంట్ బాబా భాస్కర్ అడగగా, నేనేం బాధ పడటం లేదు మాస్టర్ అని మహేష్ అంటూ వెళ్లిపోగా, తన వెనకాలే ఇంటి సభ్యులు అందరు కూడా రావడం కనిపిస్తుంది. అయితే అది నిజం కాదని కేవలం బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్ లో భాగమే అని సమాచారం. కాగా ఈ టాస్కులో నిజం ఎంత వరకు ఉందొ తెలుసుకోవాలంటే మాత్రం ఈ ప్రోగ్రామ్ చూడాల్సిందే అంటున్నారు బోగ్ బాస్ నిర్వాహకులు…