బిగ్ బాస్ 3 : శ్రీముఖిని గాడిద గా అభివర్ణించిన నాగార్జున

Saturday, September 14th, 2019, 11:26:18 PM IST

బిగ్ బాస్ కార్యక్రమం రోజు రోజుకి చాలా రసవత్తరంగా మారుతుంది. కాగా ఈసారి వారాంతం కూడా దగ్గర పడింది. అంటే ఎలిమినేషన్ కూడా దగ్గర పడిందని చెప్పాలి. అయితే ఈ వారంలో ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది మాత్రం చాలా సస్పెన్సు గా మారిందని చెప్పాలి. అయితే కాగా రేపటికి సంబందించిన ఒక ప్రోమో ని షో నిర్వాహకులు విడుదల చేశారు. కాగా ఈ ప్రోమోలో మాత్రం నాగార్జున చాలా సీరియస్ గా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఈసారి అందరి మీద కూడా చాలా సీరియస్ అయినట్లు కనిపిస్తున్నారు నాగార్జున. ఎపుడు కూడా అందరితో సరద సరదాగా గడిపినట్లు కనిపించే నాగార్జున ఈసారి మాత్రం తనకి డాన్సులు వద్దు, పాటలు వద్దు అంటూ మండిపడుతున్నాడు. అదే కోపాన్ని కంటెస్టెంట్స్ మీద చూపిస్తున్నారు నాగార్జున

కాగా హౌస్ లో శ్రీముఖి మరియు, మహేష్, పునర్నవిలకు గట్టిగ వార్నింగ్ ఇచ్చారు నాగార్జున. దానికి తోడు శ్రీముఖిని నాగార్జున గాడిద అని తిడుతూ కనపడ్డారు నాగార్జున. కాగా బిగ్ బాస్ ఇంటిలో శ్రీముఖి అందరిని చెడగొడుతుందని, నాగార్జున చాలా సీరియస్ అయ్యారు. అంతేకాకుండా పునర్నవిని కూడా చాలా గట్టిగా క్లాస్ తీసుతున్నారు నాగార్జున. కాగా ఆ వారాంతంలో జరుగుతున్నటువంటి గొడవకు కారణం తెలియాలంటే ఈ వారం ఎపిసోడ్ చూడాల్సిందే మరి.