బిగ్ బాస్ 3 : మేము లవర్స్ కాదు – క్లారిటీ ఇచ్చిన పునర్నవి

Thursday, September 19th, 2019, 12:26:55 AM IST

బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం అయినప్పటినుండి కూడా ఎంతో రసవత్తరంగా సాగుతుంది. కాగా ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులందరికి కావాల్సిన విండోణ మాత్రం అందుతుంది. కాగా ఈ షో ప్రారంభం అయినప్పటినుండి కూడా ఈ సీజన్ లో ప్రేమలో పాడేది ఎవరని అందరు కూడా చర్చించుకున్నారు. కాగా ఈసారి పునర్నవి మరియు రాహుల్ చాలా సన్నిహితంగా మెలగడంతో అందరి చూపు వీరిపైన పడిందని చెప్పాలి. ఇకపోతే ఈ ఇంటిలో నిజమైన భార్యాభర్తల కంటే కూడా వీరి సన్నివేశాలు చుడానికే ప్రేక్షకులందరూ కూడా బాగా ఎదురుచూశారు. అయితే వీరి మధ్యన ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రశ్నించగా ఈ విషయంలో పునర్నవి ఒక క్లారిటీ ఇచ్చింది. కాగా ఈ రోజు ఎపిసోడ్‌లో రాహుల్, పునర్నవి మధ్య ఉన్న గాసిప్స్‌కి సంబంధించి వితిక అడిగిన ప్రశ్నకు పునర్నవి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తామిద్దరం లవర్స్ కాదని పునర్నవి తెగేసి చెప్పింది. వివరణ ప్రకారం వీరిద్దరి మధ్యన ఉన్నది మాత్రం ఒక కాంప్లికేటెడ్ ఫ్రెండ్ షిప్ అని పునర్నవి చెప్పింది.