బిగ్ బాస్ 3 : ఇంటి సభ్యులతో సందడి చేసిన పీవీ సింధు

Sunday, September 15th, 2019, 12:49:42 AM IST

ప్రపంచ విజేత, భారత షెట్లర్ పీవీ సింధు నేడు బిగ్ బాస్ హౌస్ కార్యక్రమంలో తన కోచ్ పుల్లెల గోపీచంద్ తో సహా సందడి చేశారు. కాగా నాగార్జున తో కలిసి వచ్చిన వీరిరువురు కూడా బిగ్ బాస్ ఇంటి సభ్యులందరితో కలిసి కాసేపు సరదాగా గడిపారు. అంతేకాకుండా ఇంటి సభ్యులందరు కూడా చాలా బాగా ఆడుతున్నారని, అందరు కూడా ఇలాగె ఆడాలని, ఇకమీదట కూడా ఇలాంటి ఆటనే కనబరచాలని షెట్లర్ సింధు ఆకాంక్షించారు. ఈమేరకు మాట్లాడిన సింధు… బయట ప్రపంచంలో ఆటలు ఆడే సమయంలో కొన్ని సమయాల్లో ఎలాంటి ఎత్తుపల్లాలు వస్తాయో, ఇలాంటి హౌస్ లో కూడా అలంటి సమస్యలు ఎదురవుతున్నాయని, కానీ వాటన్నింటిని కూడా అధిగమించి విజేతగా నిలవాలని పీవీ సింధు తెలిపారు. కాగా ఇంటి సభ్యుడైన రాహుల్, సింధు మీద ఒక పాటను కూడా పాడారు, కాగా ఆ పాటకు బాబా భాస్కర్ డాన్స్ చేసి అందరిని నవ్వించారు. ఆతరువాత కాసేపు ముచ్చటించి పుల్లెల గోపీచంద్ మరియు పీవీ సింధు ఇంటి నుండి వెళ్లిపోయారు.