ఇంకో ఆల్ టైం రికార్డు దిశగా బన్నీ..!

Saturday, December 14th, 2019, 09:58:42 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అల వైకుంఠపురములో” చిత్రం విడుదల కంటే ముందే ఆడియో పరంగా బ్లాక్ బస్టర్ అయ్యిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.సంగీత దర్శకుడు థమన్ అందించిన ఫస్ట్ సింగిల్ మరియు సెకండ్ సింగిల్ పాటలకు వచ్చిన రెస్పాన్స్ అయితే సౌత్ ఫిలిం ఇండస్ట్రీలలో ఏ చిత్రాలకు కూడా రానంత స్థాయి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

అలాగే “సామజవరగమన” సాంగ్ మొట్టమొదటిసారిగా 100 మిలియన్ వ్యూస్ సహా 1 మిలియన్ లైక్స్ కొల్లగొట్టి ఇప్పటి వరకు ఏ ప్రమోషనల్ సాంగ్ కూడా అందుకోని భారీ రికార్డును అందుకుంది.ఇదే అనుకుంటే ఇప్పుడు ఆ తర్వాత సాంగ్ “రాములో రాముల” కూడా ఇదే ఫీట్ ను సాధించేందుకు దూసుకుపోతుంది.

ఇప్పటికే 93 మిలియన్ వ్యూస్ కు పైగా వచ్చేసాయి.అంతే కాకుండా 7 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.ఇదే ఊపులో ఇంకో 7 మిలియన్ వ్యూస్ అందుకోడం బన్నీకు ఏమంత కష్టం కాదని చెప్పాలి.ఇదే సాంగ్ కు కానీ 100 మిలియన్ వ్యూస్ వస్తే రెండు 100 మిలియన్ వ్యూస్ ఉన్న ఏకైక టాలీవుడ్ హీరోగా బన్నీ ఆల్ టైం రికార్డు నెలకొల్పిన వాడిగా నిలుస్తారని చెప్పాలి.మరి బన్నీ దీనికి ఎంత సమయం తీసుకుంటాడో చూడాలి.