ఈసారి వరల్డ్ రికార్డులోనే “బుట్ట బొమ్మ”.!

Thursday, May 28th, 2020, 12:40:37 PM IST


ఈ ఏడాది విడుదల కాబడిన అల వైకుంఠపురములో చిత్రం సెన్సేషన్ ఇంకా కొనసాగుతుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు సంగీతం పరంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో విడుదల అయ్యాక కూడా బాక్సాఫీస్ దగ్గర అంతే స్థాయి విజయాన్ని నమోదు చేసి రికార్డులు నెలకొల్పింది.

అది ముగిసినా ఈ సినిమాలో సెన్సేషనల్ హిట్ ట్రాక్ బుట్ట బొమ్మ హవా ఇప్పుడు ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం రామజోగయ్య శాస్త్రి గారి రచనకు అర్మాన్ మాలిక్ గొంతు తోడు కావడం జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కు బన్నీ గ్రేస్ ఫుల్ స్టెప్స్ ఈ సాంగ్ ను విజువల్ గా మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఎంతలా అంటే ఇప్పుడు ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా టాప్ 15 వీడియో సాంగ్స్ జాబితాలో నిలిచి రికార్డు నెలకొల్పింది. దీనితో బన్నీ ఫ్యాన్స్ మరోసారి కాలర్ ఎగరేస్తున్నారు.