యాంకర్ సుమ లేటెస్ట్ ఇన్నింగ్స్ సక్సెస్ అవుతుందా.?

Sunday, February 23rd, 2020, 03:35:29 PM IST


యాంకర్ సుమ పేరు తెలియని మన తెలుగు ప్రేక్షకులు ఎక్కడా ఉండరని చెప్పాలి ఆమె లేని భారీ ఆడియో ఫంక్షన్ లేదు సరదాగా సాగని టెలివిజన్ షో లేదు అని చెప్పాలి స్మాల్ స్క్రీన్ రంగంలో ఒక సూపర్ స్టార్ గా సుమ ఇప్పుడు ఎదిగారు.అయితే సుమ మొదట సీరియల్ ద్వారానే టెలివిజన్ తెరకు పరిచయం అయ్యారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఆమె సీరియల్ లో కనిపించి ఇప్పటికే రెండు దశాబ్దాలే అవుతుంది ఏమో..

కానీ ఇప్పుడు మరోసారి సుమ తన సీరియల్ రంగంలోకి రాబోతున్నారు.ఇప్పటి వరకు పలు తెలుగు ఛానల్స్ లో అనేక షోలకు యాంకర్ గా చేసిన సుమక్క ఇప్పుడు స్టార్ మా ఛానెల్ ద్వారా ఓ సరికొత్త కామెడీ సీరియల్ తో అలరించనున్నారు.”హౌస్ ఆఫ్ హంగామా” పేరిట నిన్న అనౌన్స్ చేసిన ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ సీరియల్ కు ఇప్పటి నుంచే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేసారు.మరి మన స్మాల్ స్క్రీన్ దగ్గర ఈ కామెడీ సీరియల్ ఎలా పెర్ఫామ్ చేస్తుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.