సరికొత్తగా ముస్తాబైన క్యాష్..సుమ బిగ్ బాస్

Sunday, September 15th, 2019, 12:42:49 PM IST

ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ షోకి విపరీతమైన ప్రజాదరణ ఉంది. యాంకర్ సుమ ఎప్పటికప్పుడు తనదైన రీతిలో షోని నడిపిస్తూ ముందుకి తీసుకొనివెళ్తుంది. తాజాగా వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈసారి క్యాష్ ప్రోగ్రాంని సరికొత్తగా డిజైన్ చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ షో హంగామా నడుస్తుంది కాబట్టి, దానికి తగ్గట్లు క్యాష్ ప్రోగ్రాం చేయటం జరిగింది.

ఈ షోకి జబర్దస్త్ కి చెందిన ఎనిమిది మంది స్పెషల్ గెస్ట్ లుగా వచ్చారు. వాళ్లతో సుమ బిగ్ బాస్ తరహాలో గేమ్ ఆడిస్తుంది. శాంతి కుమార్ ఎమోషనల్ గా ఈ రోజు మా కొడుకు బర్త్డే అంటే కళ్ళు మూసుకో అంటూ ఒక అబ్బాయిని అతని దగ్గరకి పంపించటం. ఆ తర్వాత శాంతి కుమార్ ఆర్పీ గురించి మీరు ఎందుకు అలా మాట్లాడారు అంటూ సీరియస్ గా సుమ వార్నింగ్ ఇవ్వటం, రాజమౌళి నువ్వు ఎందుకు వచ్చావు అసలు షోకి, నీకైనా అర్ధం అవుతుందా..?, ఎప్పుడు కూడా ఆర్పీ షాడో గానే ఉంటున్నావు తప్పితే నీకంటే ఒక వ్యక్తితం లేదా అంటూ సుమ మాట్లాడుతుంది.

అలాగే గెస్ట్ లు యొక్క ఓల్డ్ ఫోటోలు చూపిస్తూ వాళ్ళు ఎమోషన్స్ అయ్యేలా చేయటం, మధ్యలో రాజమౌళి ఎలిమినేట్ అని చెప్పటం మిగిలిన గెస్ట్ లు ఏడుస్తూ అతన్ని పంపించటం, చివరిలో సెల్ఫీ తీసుకోవటం లాంటిది అన్ని కూడా బిగ్ బాస్ థీమ్ తీసుకోని షోని చేయటం జరిగింది. ఓవర్ అల్ గా ఈ వారం క్యాష్ ప్రోగ్రాం అదిరిపోయే ఎంటెర్టైనమెంట్ ఇవ్వటానికి సిద్దమైనట్లు తెలుస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.