“ఎక్స్ట్రా జబర్దస్త్”..రూటు మార్చిన చంద్ర..ఆలీపై స్పెషల్ స్కిట్ కూడా!

Saturday, June 1st, 2019, 05:36:14 PM IST

వచ్చే శుక్రవారం 7వ తారీఖున ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదలై యూట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ దిశగా ఎప్పటిలానే దూసుకుపోతుంది.ఇక ఈ ప్రోమోను గమనించినట్లయితే ఈసారి టీమ్ లీడర్లు ఇంకాస్త కొత్తగా తమలోని కామెడీ యాంగిల్ ను బయటపెట్టారని చెప్పాలి.ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే చంద్ర ఈసారి రూటు మార్చి కాస్త కొత్త స్కిట్ ట్రై చేసారు.పూలు అమ్మే వాడి వ్యాపారం ఆగిపోతే ఆ అలవాటుకు వ్యసనం అయ్యిన వ్యక్తిగా చంద్ర చేసిన పెర్ఫామెన్స్ చాలా హిలేరియస్ గా ఉంది.

ఇక అలాగే ఈ షో కు ప్రముఖ సినీ నటుడు ఆలీ కూడా న్యాయ నిర్ణేతగా వస్తున్నారు.దీనితో మాస్ అవినాష్ మరియు కెవ్వు కార్తీక్ లు కూడా ఆలీ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన “సూపర్” మరియు “చిరుత” సినిమాల్లోని క్యారెక్టర్లను ప్రేరణగా తీసుకొని చేసారు.ఈ స్కిట్ లో సుధీర్ తన లవర్ తో రొమాన్స్ చేస్తుండగా మధ్యలో అడ్డొచ్చే పాత్రగా కార్తీక్ చేస్తే నచ్చిమి పాత్రలో అవినాష్ ఆలీకే ఝలక్ ఇచ్చారు.ఇలా వచ్చే వారం కూడా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని ఈ ప్రోమో చూస్తేనే అర్ధం అవుతుంది.మరి ఈ ఎంటర్టైన్మెంట్ మిస్సవ్వకుండా చూడాలి అంటే వచ్చే 7వ తేదీ శుక్రవారం రాత్రి 9:30 గంటలకు మీ ఈటీవీలో చూడాల్సిందే.