బుల్లితెరపైకి “చై..సామ్” ల మ్యాజికల్ “మజిలీ” డోంట్ మిస్.!

Sunday, August 18th, 2019, 12:17:39 PM IST

అక్కినేని వారసుడు యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా సమంతా హీరోయిన్ గా శివ నిర్యాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “మజిలీ”. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికి తెలుసు.ముఖ్యంగా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ చిత్రం బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమా ఇంత పెద్ద హిట్టయ్యింది.అందులోను నాగ చైతన్య మరియు సమంతల నటన మరియు వీరిద్దరి మధ్యలో నడిచే ప్రతీ సన్నివేశంను శివ అద్భుతంగా తీర్చి దిద్దడం ఈ సినిమాకు మరింత ప్లస్సయ్యింది.

దీనితో ఎంతోకాలం నుంచి సరైన హిట్ లేని నాగ చైతన్య కెరీర్ లో సాలిడ్ హిట్ ఈ చిత్రంతో పడింది.వెండితెరపై అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది.ఈ చిత్రాన్ని ఎక్స్ క్లూజివ్ గా మన్సూన్ మ్యాజికల్ ప్రీమియర్ గా జెమినీ టీవిలో ఈ ఆగష్టు 18 అంటే ఈ రోజు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.బాక్సాఫీస్ దగ్గర అంత పెద్ద విజయాన్ని అందుకున్న ఈ చిత్రం మరి స్మాల్ స్క్రీన్ పై ఎంత టీఆర్పీ రేటింగ్ తెచుకుంటుందో చూడాలి.