దీపావళికి సందడి చేయనున్న డియర్ కామ్రేడ్…

Monday, October 21st, 2019, 09:29:49 PM IST

అతి తక్కువ సమయంలోనే పెద్ద హీరో మాదిరి స్టార్ డమ్ సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ… తన నటనతో, హావ భావాలతో, ముఖ్యంగా చెప్పాలంటే తన ప్రత్యేకమైన యాసతో ప్రేక్షకులందరిని కూడా కట్టిపడేసే శక్తి సంపాదించుకున్నాడు. కాగా గత కొద్దీ కాలంగా సూపర్ హిట్ చిత్రాలను అందించినటువంటి నటుడు విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. కాగా ఈ చిత్రంలో రష్మిక మందన్న రెండవసారి విజయ్ తో జత కట్టి, ఆడిపాడిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ చిత్రంలో రష్మిక క్రికెట్ ప్లేయర్ గ కనిపించి మెప్పించింది ప్రేక్షకులందరిని మెప్పించింది కూడా.

అయితే ఈ చిత్రంలో విజయ్ బేబీ పాత్రలో కనిపించాడు. ఇతను చాలా ధైర్యవంతుడు, దేనికి వెనుకాడడు, ఎవరికీ భయపడడు. తనను నమ్ముకున్న వారి కోసం ఎంత దూరానికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తి ఒక కామ్రేడ్ లాగ ఎంత వరకు మెప్పించాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. కాగా ఈ చిత్రం ఇపుడు దీపావళి పండగ సందర్భంగా జెమినీ టీవీ లో సాయంత్రం 05:30 PM గంటలకు ప్రసారం అవనుంది. అందరం కలిసి చూసేద్దామా మరి…