“స్టార్ మా”లో ధనుష్ సినిమా ఆగిపోయింది.!

Friday, May 29th, 2020, 12:17:58 PM IST


ఈ లాక్ డౌన్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ను అందివ్వడంలో స్టార్ మా ఛానెల్ కూడా ఇతర ఛానెల్స్ తో మంచి పోటీ ఇస్తుంది. కొత్త పాత అని తేడా లేకుండా అన్ని భాషల్లోని సినిమాలను వీరు ఇచ్చేస్తున్నారు. వారానికి కనీసం రెండు సినిమాలు పాతవి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అందిస్తున్నారు.

అయితే అలా ధునుష్ మరియు కీర్తి సురేష్ లు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం “రైల్” ఈ చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈరోజు సాయంత్రం టెలికాస్ట్ చెయ్యాల్సి ఉంది కానీ ఇప్పుడు దాని స్థానంలో వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ చిత్రాన్ని రీప్లేస్ చేసారు. మరి ఈ చిత్రాన్ని ఆపేశారో వారికే తెలియాలి.