“ఢీ జోడి”లేటెస్ట్ ప్రోమో..సుధీర్ మ్యాజిక్..యష్ మాస్టర్ కూడా బ్యాక్.!

Thursday, June 6th, 2019, 01:07:12 PM IST

ఈటీవీ చానెల్లో ప్రసారమయ్యే షోలలో అటు డాన్స్ తో పాటు ఎంటెర్టైన్మెంట్ ఇవ్వడంలో “ఢీ” ప్రోగ్రాం ముందుంటుంది.ఇప్పటి వరకు 10 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని 11 సీజన్ కూడా అద్భుతంగా రాణిస్తుంది.ఇప్పుడు ఇదే షోకు సంబంధించి వచ్చే వారం టెలికాస్ట్ కాబోయే ప్రోమో బయటకు వచ్చింది.ఎప్పటిలానే ఈ ప్రోమో యూట్యూబ్ లో మిలియన్ మార్కును సింపుల్ గా అందుకుంది.ఇక ఈ ప్రోమోను చూసుకున్నట్టయితే ఈసారి ఎపిసోడ్ మాత్రం ఇంకాస్త స్పెషల్ గా వుండబోతుందనే చెప్పాలి.ఎప్పుడు వైవిధ్యమైన కాన్సెప్టులతో ఈ షోలోని పోటీదారులు తమ పెర్ఫామెన్స్ తో ఇరగదీస్తారు.

ఇప్పుడు కూడా అలాగే రోబోటిక్ డాన్స్ తో సోము అదరగొట్టాడు.ఇదిలా ఉండగా ఆ మధ్య సుధీర్ తన మ్యాజిక్ తో ఢీ స్టేజ్ అంతటిని మాయాజాలంలో నింపేసాడు.ఇప్పుడు మరోసారి తన మ్యాజిక్ తో ఈ ప్రోమోలో అలరించాడు.అలాగే సుధీర్ మరియు ప్రదీప్ మధ్యలో జెనరేట్ అయిన కామెడీ అయితే మరింత పండింది.ఇక చివరిగా రెండు సార్లు ఢీ టైటిల్ గెలుచుకున్న యస్వంత్ మాస్టర్ మళ్ళీ ఢీ స్టేజ్ పైకి మరో వైవిధ్యమైన పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు.ఇలా మొత్తంగా వచ్చే వారం టెలికాస్ట్ కాబోయే ఫుల్ ఎపిసోడ్ మాత్రం మరో సారి ఫుల్ మీల్స్ తో రెడీ గా ఉందని చెప్పాలి.ఈ ఎపిసోడ్ ను మిస్సవ్వకుండా చూడాలి అంటే వచ్చే జూన్ 12 బుధవారం రోజున మీ ఈటీవీలో రాత్రి 9:30 గంటలకు తప్పకుండా చూడండి.

 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.