ఢీ జోడీలో సందడి చేసిన రోల్ రైడా.. ప్రోమో అదిరిందిగా..!

Thursday, August 22nd, 2019, 11:42:41 PM IST

ఢీ జోడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవల్సిన అవసరం లేదు. దశాబ్దం పైగా నుండి డాన్స్ షో లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పుతూ ముందుకు సాగుతున్న “ఢీ” లో ప్రస్తుతం 11 వ సీజన్ ఢీ జోడి జరుగుతుంది. అయితే ఈ సీజన్ అప్పుడే సెమిస్ నుంచి ఫైనల్స్ లోకి కూడా అడుగు పెట్టబోతుంది. అయితే గత సీజన్ల కన్నా ఈ సీజన్‌లో కంటెస్టెంట్ల మధ్య పోటీ మరింత తీవ్రంగా కనిపిస్తుంది. ప్రతి జోడి కూడా తమ స్థాయికి మించి ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు.

అయితే ఇదంతా పక్కన పెడితే ఈ షోలో టీం లీడర్స్‌గా ఉన్నా సుధీర్ మరియు రష్మీల మధ్య కెమిస్ట్రీ, యాంకర్ ప్రదీప్ చేసే కామెడీ ఈ షోకు మరింత ఊపు తీసుకొస్తున్నాయనే చెప్పాలి. అయితే తాజాగా వచ్చే వారానికి సంబంధించి ఒక ప్రోమో విడుదలయ్యింది. అయితే ఈ వారంలో సింగర్ రోల్ రైడా గెస్ట్‌గా వచ్చి తన సాంగ్‌తో అందరిని అలరించేసారు. అయితే ఈ సారి కంటెస్టెంట్లు అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో స్టేజ్ హోరెత్తిపోయిందనే చెప్పాలి. అయితే సుధీర్, ప్రదీప్ చేసిన కామెడీ హిలేరియస్‌గా ఉంది. అయితే సెమిస్ నుంచి ఫైనల్‌లోకి ఎవరు అడుగుపెట్టబోతున్నారో తేలియాలంటే అయితే ఈ ఎపిసోడ్ మాత్రం తప్పక చూడండి. ప్రస్తుతానికి ఈ కింద ఇచ్చిన లింక్‌ని క్లిక్ చేసి ప్రోమోను చూసేసేయండి.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి