రాహుల్ కోసం పునర్నవి ఆ పనిచేస్తుందా..? అసలైన కథ షురూ

Tuesday, September 17th, 2019, 12:24:22 PM IST

రాహుల్ -పునర్నవి ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ లో మంచి జోడిగా పేరు తెచ్చుకున్నారు. మొదటి నుండి కూడా ఇద్దరి మధ్య “ఎదో” నడుస్తుందనే మాటలు గట్టిగానే వినవస్తున్నాయి. కొన్ని సార్లు తమ మధ్య ఏమి లేదని పునర్నవి చెప్పాలని చూసిన కానీ, ఎవరు నమ్మే స్థితిలో లేరు, దానికి కారణం వాళ్ళు హౌస్ లో ఉండే విధానం. ఇక తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో పునర్నవిని నామినేషన్ నుండి సేవ్ చేయటానికి రాహుల్ రకంగా 20 గ్లాసులు కాకరకాయ జ్యూస్ తాగి హౌరా అనిపించాడు. ఆ తర్వాత సంతోషంతో పునర్నవి ఏకంగా రాహుల్ కి కిస్ కూడా పెట్టింది.

ఇక ఈ రోజు రాహుల్ నామినేట్ కాకుండా సేవ్ కావటానికి పునర్నవి ఈ సీజన్ మొత్తం సెల్ఫ్ ఎలిమినేషన్ కావాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. అదే విషయాన్నీ రాహుల్ పునర్నవి కి చెప్పటంతో ఆమె ఆలోచిస్తూ నో..అన్నట్లు మనకి ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది, అయితే ఆమె ఎందుకు నో అనటం జరిగింది అనేది మాత్రం మనకి చూపించలేదు. రాహుల్ ని కాపాడటానికి పునర్నవి ఆ పని చేసిందో లేదో తెలియాలంటే మాత్రం ఈ రోజు ఎపిసోడ్ చూడవలసిందే..

ప్రోమో వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి