స్ట్రీమింగ్ నష్టాల నుంచి కాపాడేందుకే ఈ నిర్ణయమా..గమనించారా.?

Tuesday, December 10th, 2019, 03:53:01 PM IST

కాలం మారుతుండడంతో పాటుగా టెక్ రంగం కూడా విస్తృతంగా అభివృద్ధి చెందింది.అలా అభివృద్ధి చెంది ప్రేక్షకుల ఎంటర్టైనింగ్ జోన్ లో స్ట్రీమింగ్ రంగం అంటూ ఒకటి చేరి ఇంట్లోకే సినిమా స్థాయి ఎంటర్టైన్మెంట్ ను ఇంటర్నెట్ సహాయంతో అందుబాటులోకి తీసుకొచ్చేసింది.అలాగే ఏవన్నా కొత్త కొత్త సినిమాలు కానీ చిన్న సినిమాలు కానీ అవి విడుదల కాకముందే జస్ట్ సినిమా పోస్టర్లను చూసి ఈ చిత్రాన్ని థియేటర్లో చూడాలా వద్దా అని సోషల్ మీడియా ప్రజానీకం ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు.అంతలా స్ట్రీమింగ్ రంగం థియేటర్ లో సినిమాపై ప్రభావం చూపింది.

ఓ కొత్త సినిమా వస్తుంది ఆ సినిమా తాలూకా పోస్టర్ లో ఫలానా స్ట్రీమింగ్ సంస్థ లోగో కనబడితే చాలు ఇంకా ఆ సినిమాను ఇప్పుడు జనం పిచ్చ లైట్ తీసుకుంటున్నారు.అలాంటి వారి కోసమే ఇప్పుడు సినిమా వారు మరియు ఈ స్ట్రీమింగ్ సంస్థలు అయిన అమెజాన్ ప్రైమ్ మరియు నెట్ ఫ్లిక్స్ వారు ఒక నిర్ణయానికి వచ్చినట్టు అనిపిస్తుంది.ఎందుకంటే ఈ మధ్య గత రెండు మూడు నెలల నుంచే ఏ సినిమా తాలూకా డిజిటల్ రైట్స్ ఎవరు తీసుకున్నారో అన్నది పెద్ద మిస్టరీగా మారిపోయింది.

దీనితో నెటిజన్స్ సోషల్ మీడియాలో తాము ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాము ఎప్పుడు విడుదల చేస్తారు అంటూ అడుగుతున్నారు.దానికి వారు కూడా అస్పష్టమైన సమాధానమే ఇస్తున్నారు.అంతే కాకుండా చిన్న సినిమాలకు అయినా సరే పోస్టర్స్ లో ఎక్కడా వారి స్ట్రీమింగ్ సంస్థల లోగోలు కూడా వెయ్యడం లేదు.ఇలాంటి వాటి వల్ల తప్పకుండా ఈ స్ట్రీమింగ్ సంస్థల వల్ల కలుగుతున్న నష్టాల నుంచి కాస్తయినా ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.