షాకింగ్ : “డ్రామా జూనియర్స్” గోకుల్ సాయి ఇక లేడు..కారణం ఇదే!

Friday, October 18th, 2019, 02:00:36 PM IST

తెలుగులో ఉన్నటువంటి టెలివిజన్ ఛానెల్స్ లో ఒక్కొక్క యూనిక్ ఎంటర్టైనింగ్ ప్రోగ్రాం ఉన్న సంగతి తెలిసిందే.అలా జీ తెలుగు ఛానెల్ కు కూడా ఒక ప్రోగ్రాం ఉంది.అదే “డ్రామా జూనియర్స్” ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షోలో నాలగవ సీజన్ మొదలు కాబోతుంది అన్న సమయంలో ఇప్పుడు ఒక ఊహించని విషాద విషయాన్ని జీ తెలుగు వారు తెలిపారు.డ్రామా జూనియర్స్ లోని ఎంతో మంది అత్యద్భుత టాలెంట్ ఉన్న చిన్న పిల్లలు తమ తమ స్కిట్స్ తో ఔరా అని అనిపించేవారు.

అలాంటి వారిలో అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాల నటుడు గోకుల్ సాయి.టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాల కృష్ణ ను అనుకరిస్తూ ఆ ఐదేళ్ల బుడతడు చెప్పే డైలాగ్స్ అద్భుతంగా వచ్చేవి.కానీ అనూహ్యంగా గోకుల్ సాయి ఇక మన మధ్యలో లేడు అని జీ తెలుగు వారు తెలిపారు.అసలు వివరాల్లోకి వెళ్తే గోకుల్ కు డెంగ్యూ జ్వరం మూలాన కన్ను మూసాడని తెలుస్తుంది.దీనితో ఈ వార్త తెలిసిన ప్రతీ ఒక్కరు గోకుల్ కు నివాళులు అర్పిస్తున్నారు.