ఈటీవీ న్యూస్ కి కూడా భారీ టీఆర్పీ రేటింగ్.?

Saturday, April 4th, 2020, 11:48:22 AM IST


మన తెలుగులో ఉన్నటువంటి టాప్ 3 ఛానెల్స్ లో ఈటీవీ ఛానెల్ కూడా ఒకటి. ఒక్క సీరియల్స్ మాత్రమే కాకుండా షోలు కానీ ప్రతి పండుగకు ప్లాన్ చేసే ఈవెంట్స్ కానీ అదిరిపోయే రెస్పాన్స్ ను రాబడతాయి. అలాగే యూట్యూబ్ లో కూడా అంతే స్థాయి రెస్పాన్స్ అందుకుంటాయి.

అయితే ఇదే ఛానెల్లో ప్రతీ రోజు కేవలం అరగంట మాత్రమే ప్రసారం అయ్యే ఈటీవీ న్యూస్ కు కూడా ఈ ఏడాదిలో 12 వ వారం భారీ టీఆర్పీ రేటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే ఈ వార్తా ప్రసారాలు యూట్యూబ్ లో కూడా పలు మార్లు టాప్ ట్రెండింగ్ లోకి కూడా వచ్చాయి.

ఇంతకీ గత వారం ఈటీవీ న్యూస్ కు ఎంత టీఆర్పీ వచ్చిందో తెలుసా అర్బన్ మరియు రూరల్ లో కలిపి 10.09 రేటింగ్ పాయింట్స్ వచ్చినట్టు తెలుస్తుంది. జస్ట్ అరగంట ప్రసారం అయ్యే ఈ ఈటీవి న్యూస్ కు ఈ స్థాయి రేటింగ్ రావడం ట్రెండ్ సెట్టింగ్ అని చెప్పాలి.