నిరంతరాయంగా ఈటీవీ న్యూస్ నెంబర్ స్థానంలో.!

Saturday, May 30th, 2020, 05:12:17 PM IST

ప్రతీ వారం లానే ఈసారి కూడా గత వారపు టాప్ 5 ప్రోగ్రాం ల జాబితాను బ్రాడ్ క్యాస్ట్ రీసెర్చ్ ఆడియెన్స్ కౌన్సిల్ ఇండియా వారు విడుదల చేసారు. మన దేశంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచీ టీవీ వీక్షకుల సఞ్చయా అమాంతం పెరిగింది. అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతే స్థాయిలో పెరిగింది.

అయితే అదే సమయంలో మన తెలుగులో ప్రతీ వారం టాప్ లో నిలుస్తున్న 5 ప్రోగ్రామ్స్ ఏమిటో వారు వెల్లడిస్తున్నారు. అలా మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్ టైం నెంబర్ 1 స్థానంలో ఈటీవీ న్యూస్ నిలుస్తూ హవా నిరంతరాయంగా కొనసాగిస్తుంది. భారీ ఎత్తున ఇంప్రెషన్స్ తో ఈటీవీ నెంబర్ స్థానంలో నిలుస్తుండగా ఇతర ఛానెల్స్ లోని సీరియల్స్ మరియు ప్రోగ్రామ్స్ మిగతా స్థానాలతో సరిపెట్టుకున్నాయి.