భారీ వ్యూస్ తో ట్రెండింగ్ లో అదరగొడుతున్న ఈటీవీ ప్రోగ్రామ్స్.!

Sunday, August 2nd, 2020, 06:27:27 PM IST

మన తెలుగు ఎంటర్టైనింగ్ ఛానెల్స్ లో ఈటీవీ ఛానెల్ కు ఒక ప్రత్యేకమైన స్థానం చేరగనిదిగా అలా నిలిచిపోయింది. వారి షోల ద్వారా ఇస్తున్న ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు టాప్ ప్లేస్ లో నిలుస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. బుధవారం మొదలు కొని శనివారం వరకు నాన్ స్టాప్ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ను ఈటీవీ వారు తెలుగు ప్రేక్షకులకు అందిస్తారు.

అయితే వీరు చేసే ప్రోగ్రామ్స్ తాలూకా ప్రోమో వీడియోస్ స్కిట్స్ సహా ఫుల్ షోలు కూడా యూట్యూబ్ టాప్ 5 రేస్ లో నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా యూట్యూబ్ లో నెంబర్ 1 మరియు నెంబర్ 2 స్థానాలు కూడా ఈటీవీ షోలే ఆక్రమించాయి.

గత శుక్రవారం టెలికాస్ట్ అయిన ఎక్స్ట్రా జబర్దస్త్ లోని సుడిగాలి సుధీర్ స్కిట్ ఒక్క రోజులో 3.1 మిలియన్ వ్యూస్ తో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ ఉండగా ఆ తర్వాత స్థానంలో వచ్చే వారపు `”ఢీ ఛాంపియన్స్” ప్రోమో కేవలం మూడు రోజులలోనే 7.9 మిలియన్ వ్యూస్ తో పాటుగా ఏకంగా 1 లక్ష 48 వేలకు పైగా లైక్స్ తో నెంబర్ 2 స్థానంలో నిలిచింది.