ఈ సంక్రాంతికి ఒక్క ఎంటర్టైన్మెంటే కాదు..ఎమోషన్స్ కూడా.!

Tuesday, January 14th, 2020, 10:08:48 AM IST

ఈసారి సంక్రాంతి పండుగకు వెండితెరపైకి వచ్చిన చిత్రాలు అదరగొడుతున్నాయి.అలాగే ఇంకో పక్క టెలివిజన్ చానెల్స్ కూడా వారి వారి ఈవెంట్లతో అదిరిపోయే ఈవెంట్లతో ఒక్కో ఛానెల్ కూడా సిద్ధంగా ఉంది. అయితే ఎన్ని ఈవెంట్స్ ఈ సంక్రాంతి రోజున టెలికాస్ట్ అయినా సరే ఈటీవీలో ప్రసారం చేసే ఈవెంట్లు మాత్రం కాస్త స్పెషల్ అనే చెప్పాలి.అలా ఈ సంక్రాంతి కుటుంబం అంతా కలిసి ఒకే దగ్గర కూర్చొని చూడదగె ఈవెంట్ “అమ్మ నాన్న సంక్రాంతి” అనే ఎంటర్టైనింగ్ ఈవెంట్ ను ప్లాన్ చేసారు.

ఈ రేపు సంక్రాంతి పర్వదినాన టెలికాస్ట్ కాబోయే ఈ ఈవెంట్ తాలుకా ప్రోమోలు అత్యద్భుతంగా వచ్చాయి.అయితే ఇన్ని రోజులు చూసిన ప్రోమోలలో కేవలం కడుపుబ్బా నవ్వించే నవ్వులు మాత్రమే కాకుండా ఆనందంతో జారువాలే కన్నీళ్లను కూడా పరిచయం చెయ్యనున్నారు.ఈ ఈవెంట్లో జబర్దస్త్ కంటెస్టెంట్స్ తాలూకా పిల్లలు తో పాడించిన పాట ఎమోషనల్ గా రోజా చెప్పిన మాటలు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కు హత్తుకునేలా ఉన్నాయి.ఇలా ఈ ఈవెంట్ కేవలం వినోదాత్మకంగానే కాకుండా మంచి ఎమోషన్స్ తో కూడా ఉంది అని చెప్పాలి.ఈ ఈవెంట్ రేపు సంక్రాంతి రోజున ఉదయం 9 గంటలకు మీ ఈటీవీలో ప్రసారం కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.