సీమా బిడ్డగా రాజమౌళి రాజసం..రష్మీని సుధీర్ అంత మాటన్నాడా..?

Saturday, September 21st, 2019, 11:31:15 AM IST

ప్రతి శుక్రవారం వచ్చే ఎక్సట్రా జబర్దస్త్ వారం వారం అదిరిపోయే స్క్రిప్ట్స్ తో అదరకొడుతుంది . ఎప్పటికప్పుడు టీం లీడర్స్ కామెడీ డోస్ పెంచుకుంటూ ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని పంచిపెడుతున్నారు. వచ్చేవారానికి సంబంధించిన ఎక్సట్రా జబర్దస్త్ ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. ఇందులో ప్రతి ఒక్కరి స్క్రిప్ట్ అదిరిపోయే రేంజులో వుండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా బుల్లెట్ భాస్కర్ టీం మరోసారి రాజమౌళి ప్రధానంగా స్క్ర్పిట్ చేసింది. రాయలసీమకి చెందిన ఫ్యాక్షనిస్ట్ కొడుకుగా రాజమౌళి కనిపిస్తాడు. గతంలో మాదిరిలో ఇందులోనూ తెలివైన అమాయకుడిగా కనిపిస్తూ నవ్వులు పూహిస్తాడు. గతంలో ఇలాంటివే చేసిన కానీ, ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తున్నాయి. పంచులు కూడా ఒకదాని తర్వాత మరొకటి హిలేరియస్ గా నవ్వుకునేలా చేస్తున్నాయి.

ఇక సుడిగాలి సుధీర్ టీం ఈ సారి కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఒక స్క్రిప్ట్ చేసింది. ఇందులో సుధీర్,ఆటో రామ్ ప్రసాద్ ఇద్దరు కూడా స్టూడెంట్స్ గా ఉంది. ర్యాగింగ్ చేస్తుంటారు. అదే కాలేజీలో లెక్చరర్ గా ఉండే చమ్మక్ చంద్ర సుధీర్ కి పనిస్మెంట్ ఇస్తూ రశ్మితో సహా ప్రతి ఒక్కరు సిస్టర్స్ అని చెప్పమంటే ఒక్క రష్మీని తప్ప అందరిని అంటానని సుధీర్ అంటాడు. అందరు వద్దులే ఒక్క రష్మిని మాత్రమే చెల్లి అని పిలువు అంటూ చమ్మక్ చంద్ర చెప్పటం దానికి సుధీర్ ఇబ్బంది పడటం చూస్తే భలే గమ్మత్తుగా ఉంటుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి