అదిరిపోయే పంచ్‌లతో అలరిస్తున్న ఎక్స్‌ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో..!

Sunday, June 16th, 2019, 06:46:08 PM IST

బుల్లితెరపై ప్రస్తుతం నంబర్‌వన్ ప్రోగ్రాంగా పేరు సంపాదించుకున్నది జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్. అయితే ఈ కామెడీ ప్రోగ్రాం ద్వారా అందరిని కడుపుబ్బా నవ్విస్తుంటారు ఇందులోని కంటెస్టెంట్లు. అయితే ఇందులోని కంటెస్టెంట్లు తమ సరికొత్త స్కిట్లతో, పంచ్ డైలాగ్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. అంతేకాదు సరదాగా అప్పుడప్పుడు జడ్జెస్ మీద, యాంకర్‌ల మీద మరియు ప్రస్తుతం భయట జరుగుతున్న సన్నివేశాల మీద కూడా స్కిట్లు చేస్తుంటారు.

అయితే వచ్చే వారం మనముందుకు రాబోతున్న ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లోని పంచులు ప్రోమో ద్వారా అందరిని ఆకట్టుకుంటున్నాయి. టీం లీడర్‌గా చమ్మక చంద్ర ప్రతి సారి ఏ విధంగా అలరిస్తాడో ఈ సారి కూడా అలానే నవ్వించాడు. అంతేకాదు యాంకర్ రష్మీపై సరదాగా పంచులు వేస్తూ, మొగుడిని ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలలో తన స్కిట్‌లో చూపించబోతున్నాడు. ఇక సుడిగాలి సుధీర్ టీం గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. సుధీర్, శ్రీను, రాం ప్రసాద్ చేసే స్కిట్స్ ద్వారా ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటారు. ఇక అవినాష్ టీం, చంటి, ఆర్పీ ఇందులో పిచ్చ కామెడీ పుట్టించారు. ఏది ఏమైనా కడుపుబ్బా నవ్వుకోవాలనుకుంటే మాత్రం ఈ శుక్రవారం వచ్చే ఎక్స్‌ట్రా జబర్దస్త్ కార్యక్రమాన్ని మాత్రం తప్పకుండా చూడాల్సిందే. ఈ ఎపిసోడ్‌కి సంబంధించి ప్రోమోను చూడాలనుకుంతే ఈ క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి