బిగ్ బాస్-3 లో ప్రముఖ యాంకర్…?

Monday, June 10th, 2019, 08:40:58 PM IST

తెలుగు టీవీ చరిత్రలో అత్యంత ప్రజాదరణని సంపాదించుకున్న ప్రోగ్రాం బిగ్ బాస్… ఈ ప్రోగ్రాం విజయవంతంగా ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకుంది. కాగా ఇపుడు సరికొత్తగా మూడవ సీజన్ కూడా రాబోతుంది. ఇప్పటివరకు విజయవంతంగా ప్రదర్షింపబడిన ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కానీ మూడవ సీజన్ కి మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి… ప్రోగ్రాం హోస్ట్ దెగ్గర నుంచి, హౌస్ సభ్యులు ఎవరు ఉండబోతారో ఎవ్వరికి ఫుల్ క్లారిటీ లేదు. హోస్ట్ విషయంలో ఇన్ని రోజులు చర్చలు జరగగా, చివరికి నాగార్జున దాదాపుగా ఓకే చెప్పేసాడని సమాచారం. ఇకపోతే పార్టిసిపేట్స్ విషయానికి వస్తే మాత్రం కేఏ పాల్ మరియు రేణు దేశాయ్ ఇంకా ఎంతోమంది పేర్లు వస్తున్నాయి. కానీ అవన్నీ కూడా పుకార్లేనని కొట్టిపారేస్తున్నారు షో నిర్వాహకులు… తాజాగా ఈ షో లో తీన్మార్ వార్తల ఫేమ్ సావిత్రి పేరు కూడా బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్స్ లిస్ట్ లో ఉందని సమాచారం. వీ6లో ప్రసారం అవుతున్న తీన్మార్ వార్తలతో సావిత్రి అలియాస్ జ్యోతి బాగా ఫేమస్ అయ్యింది.

తెలంగాణ అమ్మాయిగా బిగ్ బాస్ 3 లో జ్యోతి ఎంట్రీ ఉంటుందని సమాచారం. కాకపొతే అంత సక్సెసఫుల్ గా ప్రదర్శితమవుతున్నటువంటి తీన్మార్ వార్తలని వదిలి సాఫిత్రక్క వస్తుందో లేదో చూడాలి మరి…