“అల వైకుంఠపురములో” స్టీమింగ్ కు డేట్ వచ్చేసిందా.?

Monday, February 17th, 2020, 12:20:24 PM IST


టాలీవుడ్ స్టైలిష్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ చిత్రం “అల వైకుంఠపురములో”. అయితే ఇప్పటి రోజుల్లో మారిపోయిన ట్రెండ్ కు షాకిస్తూ ఈ చిత్రాన్ని అంత త్వరగా అయితే డిజిటల్ ఫ్లాట్ ఫారం లో అందుబాటులోకి తీసుకురామని చిత్ర యూనిట్ తేల్చి చెప్తూ ఈ మధ్య కాలంలో ఎంతో పాపులర్ అయిన “అమెజాన్ ప్రైమ్” కానీ “నెట్ ఫ్లిక్స్”లలో కానీ అందుబాటులో ఉండదని కూడా చెప్పేసరికి సినీ ఆడియెన్స్ కు ఈ చిత్రాన్ని థియేటర్లో చూడడం తప్ప ఆప్షన్ లేదు.

అలా చిత్ర యూనిట్ వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ అయ్యింది.అంతేకాకుండా ఇప్పుడు ఈ చిత్రం వచ్చి నెల రోజులు దాటినా సరే బాక్సాఫీస్ దగ్గర అదే హవాను కొనసాగిస్తోంది.అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ చిత్రానికి సంబంధించి డిజిటల్ స్ట్రీమింగ్ కు డేట్ వచ్చినట్టు తెలుస్తుంది.ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్ నెల 8 నుంచి అందుబాటులోకి రానుంది అని ఈ చిత్రం తాలూకా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న “సన్ నెక్స్ట్” వారు తెలుపుతున్నట్టు సమాచారం.మరి అదే తేదీన వస్తుందో లేదోచూడాలి.ఒకవేళ ఎప్పుడు వచ్చినా సరే డిజిటల్ గా ఎలాంటి వ్యూవర్
షిప్ ను రాబడుతుంతో చూడాలి.