సరికొత్త షోతో మొత్తానికి ప్రదీప్ ఈజ్ బ్యాక్.!

Friday, November 15th, 2019, 05:06:59 PM IST

గత కొంత కాలంగా బుల్లితెర ఫేమస్ యాంకర్ ప్రదీప్ తన షోలకు దూరంగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.దీనితో ప్రదీప్ అభిమానులు అంతా అతన్ని ఎంతగానో మిస్సయ్యారు.కానీ మళ్ళీ ఇంత కాలం తర్వాత ప్రదీప్ బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చారు.అందులోను ఒక సరికొత్త షో ద్వారా ఎంట్రీ ఇచ్చారు.జీతెలుగు ఛానెల్లో ఇప్పుడు ఒక సరికొత్త ప్రోగ్రాం స్టార్ట్ కాబోతున్నట్టు వెల్లడి చేసారు.దీనికి గాను “సరె సర్లే ఎన్నెన్నో అనుకుంటాం” అన్ని జరుగుతాయా ఏంటి అన్న ట్యాగ్ లైన్ పెట్టారు.

అతి త్వరలోనే ప్రారంభం కానున్న ఈ షోలో ప్రముఖ కమెడియన్స్ అంతా కనిపిస్తున్నారు.వండర్స్ వేణు,ధన్ రాజ్,చమ్మక్ చంద్ర ఇలా చాలా మందే ఉన్నారు అంతే కాకుండా నాగబాబు కూడా ఈ షోలో ఉన్నట్టు తెలుస్తుంది.యాంకర్ రవి,అక్సా ఖాన్ ఇలా చాలా మందే ఈ షోలో కనిపిస్తున్నారు.అయితే ఇంత కాలం గ్యాప్ రావడంతో ప్రదీప్ “అల వైకుంఠపురములో” టీజర్ స్టైల్ లో గ్యాప్ వచ్చిందని చెప్పారు.మొత్తానికి ఇప్పుడు మాత్రం ప్రదీప్ రీఎంట్రీతో అతని అభిమానులు ఫుల్ ఖుషి అయ్యిపోతున్నారు.