టెలివిజన్ చరిత్రలో మొట్ట మొదటిసారి నాగబాబు స్కిట్.!

Thursday, October 17th, 2019, 03:15:46 PM IST

ఇప్పుడు ఈటీవీ ఛానెల్ మరోసారి పండుగ ఈవెంట్ తో అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పాలి.ఇప్పటికే “వినాయక చవితి” మరియు “దసరా” ఈవెంట్లతో అదరగొట్టగా ఇప్పుడు “దీపావళి” ఈవెంట్ తో మరింత ఎంటర్టైన్మెంట్ తెలుగు ప్రేక్షకులకు ఖాయమని చెప్పాలి.ఈ స్పెషల్ ఈవెంట్ కు “ఉత్తమ పురుషులు”గా పేరు పెట్టిన ఈ ఈవెంట్ కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదల అయ్యింది.ఈ ప్రోమోను బట్టి ఖచ్చితంగా ఈసారి ఈవెంట్ మాత్రం ముందుకన్నా కాస్త విభిన్నంగా ఉండడం ఖాయమని చెప్పాలి.

సుధీర్,చమ్మక్ చంద్ర మరియు చలాకి చంటిలు వాళ్ళ భార్యలు పెట్టే బాధలు తాళలేక హిమాలయాలకు వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యారు.అయితే అప్పుడే సుమ వచ్చి హిమాలయాలకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నావని సుధీర్ ని అడగ్గా అక్కడికి వెళ్లి పాపాలన్నీ కడిగేసుకుందామని చెప్పగా దానికి సుమ ముందు నువ్విక్కడ పాపలను వదిలేసేయ్ అని వేసిన పంచ్ అదిరింది.ఇక నెక్స్ట్ లాఫింగ్ కింగ్ నాగబాబు అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు.

ఇంత స్లిమ్ అయ్యిపోయేరేంటని సుధీర్ అడగ్గా “మనం స్లిమ్ అయ్యావని పది మందికి తెలవకపోతే ఇక స్లిమ్మవ్వుడు ఎందుకురా” తన తనయుడు “గద్దలకొండ గణేష్” సినిమా స్టైల్ డైలాగ్ తో అదరగొట్టేసారు.ఇక అలాగే మొట్టమొదటి సరిగా టెలివిజన్ చరిత్రలోనే నాగబాబు ఒక స్కిట్ కూడా ఈ “ఉత్తమ పురుషులు”లో పెర్ఫామ్ చేసారు.ఈ స్కిట్ కూడా కడుపుబ్బా నవ్వించేలా ఉంది.మరి ఈ స్పెషల్ ఈవెంట్ లో ఇంకెంత ఫన్ ఉందో తెలియాలంటే రాబోయే దీపావళి రోజున మీ ఈటీవీలో ఈ ఈవెంట్ ను తప్పక చూడాల్సిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి