శేష్ బ్లాక్ బస్టర్ సినిమా హక్కులను సొంతం చేసుకున్న జెమినీ.!

Wednesday, October 16th, 2019, 11:34:48 AM IST

తన సినిమా కెరీర్ మొదటి నుంచి కూడా టాలీవుడ్ కు తనదైన మార్క్ సినిమాలను పరిచయం చేస్తూ వచ్చారు హీరో అడవి శేష్. “పంజా” సినిమాతో బ్రేక్ తీసుకొని టాలీవుడ్ ఒక సరికొత్త థ్రిల్లింగ్ మూవీస్ ను తన రచనా స్థైర్యం తో తెరకెక్కిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.”క్షణం”, “గూఢచారి” లాంటి వైవిధ్య చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించడంతో తన తర్వాత సినిమాపై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలను పెట్టుకున్నారు.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే అడవి శేష్, నవీన్ చంద్ర మరియు రెజీనా కసాండ్రాలు ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం “ఎవరు”. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులు శేష్ నుంచి ఎలాంటి సినిమా అయితే కోరుకున్నారో అలంటి సినిమానే అందించారు.అయితే ఇప్పుడు ఈ చిత్రం తాలూకా శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నట్టుగా వారి అధికారిక సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.మరి ఈ చిత్రాన్ని వీరు ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో చూడాలి.