మరో క్లీన్ హిట్టు సినిమా హక్కులను సొంతం చేసుకున్న జెమినీ.!

Wednesday, October 16th, 2019, 08:23:15 PM IST

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని మరింత విస్తరింపజేస్తున్నాయి.బడా హీరోలు కొన్ని కొన్ని ప్రయోగాలు విభిన్నమైన సినిమాలు చెయ్యడం మొదలు పెడుతున్నా చిన్నగా అద్దిరిపోయే కంటెంట్ తో వస్తున్న సినిమాలు మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి.

అలాగే విడుదలై మంచి విజయాన్ని “బ్రోచేవారెవరురా” అందుకుంది శ్రీవిష్ణు,ప్రియదర్శి మరియు రాహుల్ రవీంద్రలు ప్రధాన పాత్రల్లో నివేత థామస్ హీరోయిన్ గా సత్య దేవ్ మరియు నివేత పేతురాజ్ లు మరో ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సచ్విన్ మరియు అతని బృందం దర్శకత్వం వహించింది.

అయితే ఇప్పుడు సినిమా తాలూకా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానెల్ అయిన జెమినీ టీవీ వారు దక్కించుకున్నట్టుగా అధికారికంగా వెల్లడించారు.అయితే మళ్ళీ ఇదే రోజున అడవి శేష్ రీసెంట్ బ్లాక్ బస్టర్ అయినటువంటి “ఎవరు” హక్కులను కూడా సొంతం చేసుకున్నామని తెలిపారు.ఇలా ఒకే రోజున రెండు సినిమాల హక్కులను సొంతం చేసుకోవడం విశేషం.మరి ఈ రెండు చిత్రాలు ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో చూడాలి.