ఇంక అసలు గేమ్ స్టార్ట్ చేసిన జెమినీ టీవీ..మొదట అనసూయ తోనే!

Tuesday, February 25th, 2020, 08:08:11 AM IST

ఇప్పుడు వీక్షకులు ఎంటర్టైన్మెంట్ రంగానికి పెద్ద పీట వేస్తున్నారు.బిజీ బిజీ జీవనాన్ని గడుపుతూ కాస్త రిలాక్స్ అవ్వడానికి ఏదన్నా ఛానెల్ పెడితే కాసేపు హాయిగా నవ్వుకోడానికి ఎంటర్టైన్ అవ్వడానికి అలవాటు పడ్డారు.అయితే ఈరోజుల్లో అన్ని ఛానెల్స్ లోను సరైన ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందా అంటే లేదని చెప్పాలి.కేవలం ఒకటి రెండు ఛానెల్స్ లో మాత్రమే మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుండగా మరోపక్క కొన్ని ఛానెల్స్ మాత్రం ఈ విషయంలో కాస్త వెనకబడిపోయాయి.

అలాంటి ఛానెల్స్ లో జెమినీ టీవీ కూడా ఒకటి కానీ వీరు కూడా ఇప్పుడు దానిపై దృష్టి పెట్టి అసలు ఆట మొదలు పెట్టారు.గత కొన్ని రోజుల క్రితమే సరికొత్తగా మొత్తం 5 షోలతో వస్తున్నామని తెలిపారు.కానీ ఈరోజున ఏ షోను ప్రసారం చేస్తారు అన్నది వివరించలేదు.కానీ ఇప్పుడు ఆ టైం వచ్చేసింది.వీరు మొట్ట మొదటగా యాంకర్ అనసూయ తోనే స్టార్ట్ చేసారు.వచ్చే మార్చ్ 2 సోమవారం నుంచి “తల్లా పెళ్ళామా” అనే బ్రాండ్ న్యూ ఎంటర్టైనింగ్ షోను ప్రసారం చేయనున్నట్టు తెలిపారు.మరి ఈ సరికొత్తషో ఎలా ఉండబోతుందో చూడాలి.