మరో బ్లాక్ బస్టర్ కాంబో హక్కులు దక్కించుకున్న జెమినీ టీవీ!

Tuesday, November 19th, 2019, 03:41:06 PM IST

గత కొన్ని రోజుల నుంచి కూడా తెలుగు స్మాల్ స్క్రీన్ పై టాప్ మోస్ట్ ఛానెల్స్ లో ఒకటి అయినటువంటి జెమినీ ఛానల్ తెలుగులోని ఈ మధ్య కాలంలో వచ్చిన డీసెంట్ హిట్ మరియు మంచి కంటెంట్ ఉన్న చిత్రాల తాలూకా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంటూ రోజుకొక సినిమాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వస్తున్నారు.అలా తీసుకున్న వాటిని ప్రతీ ఆదివారం టెలికాస్ట్ చేస్తున్నారు.

అలాగే ఇప్పుడు తాజాగా మరో సినిమా హక్కులను వారు సొంతం చేసుకున్నారు.కింగ్ నాగార్జున తనయుడు నాగ చైతన్య మరియు విక్టరీ వెంకటేష్ ల కలయికలో దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ చిత్రం “వెంకీ మామ” ఇంకా షూటింగ్ లోనే ఉన్న ఈ చిత్రం తాలూకా హక్కులను కూడా జెమినీ టీవీ వారు దక్కించుకున్నట్టుగా అధికారికంగా వెల్లడి చేసారు.మొత్తానికి జెమినీ టీవీ వారు మాత్రం ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పాలి.