ఎక్కడా తగ్గని జెమినీ..మరో క్రేజీ ప్రాజెక్టు హక్కులు కూడా!

Friday, October 18th, 2019, 04:03:55 PM IST

మాములుగా ఒక సినిమా వస్తుంది అంటే దాని తాలూకా హక్కులను దాని తాలూకా హక్కులను సొంత చేసుకోడానికి బ్రాడ్ కాస్ట్ సంస్థలు విపరీతంగా ప్రయత్నిస్తుంటాయి.కానీ ఇప్పుడు మాత్రం జెమినీ ఛానెల్ ఇవన్నీ వార్ వన్ సైడ్ చేసేస్తోంది.ఇప్పుడు మిగతా ఛానెల్స్ తో పోల్చినట్లయితే జెమిని ఛానెల్ మాత్రం తెలుగు ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్మెంట్ అందించడానికి గట్టిగా ఫిక్స్ అయ్యినట్టున్నారు.టాలీవుడ్ లో చిన్న సినిమాలే అయినా సరే మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను జెమిని ఛానెల్ ఎగరేసుకుపోతుంది.

గత రెండు రోజుల్లోనే అడవి శేష్ నటించిన “ఎవరు” చిత్రం అలాగే శ్రీ విష్ణు మరియు నివేత థామస్ లు నటించిన “బ్రోచేవారెవరురా” సినిమా హక్కులను సొంతం చేసుకుంది.మళ్ళీ ఈలోపే నాచురల్ స్టార్ నాని ఫుల్ ఆన్ విలన్ రోల్ లో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న “వి” చిత్రం హక్కులను కూడా తాము కొనుగోలు చేసినట్టుగా తెలుపుతున్నారు.మొత్తానికి జెమినీ ఛానెల్ యాజమాన్యం మాత్రం ఎక్కడా తగ్గడం లేదని చెప్పాలి.