అనుకున్నదే చేసిన జెమినీ టీవీ..ఏజెంట్ వస్తున్నాడు!

Monday, November 18th, 2019, 11:30:49 AM IST

గత కొన్ని రోజుల నుంచి కూడా జెమినీ ఛానెల్ తెలుగు రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రాల తాలూకా సాటిలైట్ హక్కులను కొనుగోలు చేసి వాటిని ప్రతీ ఆదివారం సండే ప్రీమియర్స్ గా ఒక్కొక్క చిత్రాన్ని అందించబోతున్నామని తెలిపారు.అలాగే నిన్న ఆదివారం క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ “రాక్షసుడు”ను టెలికాస్ట్ చేసారు.

అయితే ఆ చిత్రం టెలికాస్ట్ చేసే సమయంలోనే వారు తీసుకున్న మరో హిట్ చిత్రం “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” పోస్టర్ ను రాక్షసుడు కి లింక్ చేసి పోస్ట్ చేయడంతోనే తర్వాత చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అని అర్ధం అయ్యిపోయింది.

ఇప్పుడు ఆ అంచనాలను నిజం చేస్తూ ఈ చిత్రాన్నే వచ్చే ఆదివారం టెలికాస్ట్ చెయ్యబోతున్నట్టుగా వారు ఖరారు చేసేసారు.రాక్షసుడు లానే ఈ చిత్రం కూడా వచ్చే నవంబర్ 24 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ స్పై థ్రిల్లర్ ను వెండితెరపై కానీ మిస్సయ్యి ఉంటే బుల్లి తెరపై మాత్రం మిస్సవ్వకండి.