ప్లాపయిన జెమినీ టీవీ ప్లానింగ్.!

Wednesday, December 11th, 2019, 11:38:36 AM IST

తెలుగులో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఎంటర్టైనింగ్ ఛానెల్స్ లో ఎప్పటి నుంచో పక్కాగా టాప్ 3లో ఒకటిగా ఇప్పటికీ కొనసాగుతున్న ఛానెల్ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా జెమినీ ఛానల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే ఈ మధ్యనే ఈ ఛానల్ మిగతా ఛానెల్స్ ను మించి సరికొత్త బ్లాక్ బస్టర్ సినిమాల శాటిలైట్ హక్కులను దక్కించుకొని వాటిని ప్రతీ ఆదివారం తెలుగు ప్రేక్షకుల కోసం అందించబోతున్నామని దానికి జెమినీ ప్రీమియర్ పండుగ అనే పేరును కూడా పెట్టి ఓ మూడు సినిమాలను కూడా అదిరిపోయే ప్రమోషన్స్ తో ఆ చిత్రాలను టెలికాస్ట్ చేసారు.

పక్కాగా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళిపోతుంది అని అనుకున్న సమయంలో వారి ప్లానింగ్ ఎందుకో బెడిసి కొట్టింది.క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ “రాక్షసుడు” మొదలుకొని “బ్రోచేవారెవరురా” వరకు మూడు చిత్రాలను బాగానే టెలికాస్ట్ చేసారు.ఇలా ప్రతీ ఆదివారం ఒక సరికొత్త సినిమాను టెలికాస్ట్ చేస్తారు అనుకునే లోపే ఈ ప్రీమియర్ పండుగను ఆపేసారు.సో వీరికి పర్ఫెక్ట్ ప్లానింగ్ లేనట్టే కదా.ముందు ఒకలా చెప్పి మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇచ్చే దానికి ప్రతీ వారం ఓ సరికొత్త సినిమా అని చెప్పడం ఎందుకు?ఇప్పుడు ఇలా మధ్యలో ఆపెయ్యడం ఎందుకు?అదంతా కాకుండా ముందే ఇలా జరుగుతుందని ఆలోచించి కరెక్ట్ గా ప్లాన్ చేసి వారి వీక్షకుల్లో కూడా మంచి పేరు వచ్చేది.వీరే అనవసరంగా వారి ఫ్లో ను దెబ్బ తీసుకున్నారు.దానికి తోడు మళ్ళీ వచ్చే వారం టెలికాస్ట్ చెయ్యబోయే సినిమా కోసం కూడా ఇంకా ఎలాంటి సమాచారాన్ని వారు ఇవ్వడం లేదు.