అదిరిపోయే హాలీవుడ్ చిత్రంతో జెమినీ టీవీ.!

Saturday, May 23rd, 2020, 02:51:40 PM IST


ఈ లాక్ డౌన్ సమయంలో జెమినీ టీవీ మరియు స్టార్ మా ఛానెల్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయి. జెమినీ ఛానెల్లో అయితే సరికొత్త ఇస్తుంటే స్టార్ మా లో మాత్రం అదిరిపోయే హాలీవుడ్ సినిమాలు ప్రసారం చేస్తున్నారు. కానీ ఇపుడు జెమినీ టీవీ వారు కూడా ఓ అదిరిపోయే హాలీవుడ్ చిత్రంతో తమ వీక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నారు.

సూపర్ హీరోల సినిమాలలో “స్పైడర్ మ్యాన్” సిరీస్ కు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అలా ఒకప్పుడు వచ్చిన సిరీస్ లో వచ్చిన మూడో సినిమా స్పైడర్ మ్యాన్ 3 చిత్రాన్ని టెలికాస్ట్ చెయ్యనున్నారు. వచ్చే మే 27 బుధవారం సాయంత్రం ఈ చిత్రాన్ని స్పెషల్ షో గా టెలికాస్ట్ చెయ్యనున్నారు. స్పైడర్ మ్యాన్ సిరీస్ ఫ్యాన్స్ కు ఈ చిత్రం ఒక ఫీస్ట్ లాంటిది. సో ఈసారి ఈ చిత్రాన్ని మాత్రం ఎవరు మిస్సవ్వరని చెప్పాలి.