ఆ హాలీవుడ్ సెన్సేషనల్ సినిమాలు జెమినిలో?

Friday, May 29th, 2020, 01:27:21 PM IST


ఇటీవలే మన తెలుగు టాప్ ఛానెల్స్ లో ఒకటైన జెమినీ టీవీ ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ తో టై అప్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే మొన్న హాలీవుడ్ సూపర్ హీరో యాక్షన్ చిత్రం స్పైడర్ మ్యాన్ 3 సినిమాను టెలికాస్ట్ చేసారు.

అలాగే అక్కడ నుంచి మరిన్ని హాలీవుడ్ సినిమాలు ఇక నుంచి జెమినీ ఛానెల్లో టెలికాస్ట్ అవుతాయని కూడా సమాచారం వచ్చింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం హాలీవుడ్ లో బిగ్గెస్ట్ యాక్షన్ రేసింగ్ సిరీస్ అయిన “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్” సినిమాలను ఎక్స్ క్లూజివ్ గా టెలికాస్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ సినిమాలను జెమినీ ఛానెల్లో టెలికాస్ట్ చేయనున్నట్టు ఇప్పుడు సమాచారం.