ప్రీమియర్ గా జెమినీలో ఆగిపోయిన సినిమా!

Thursday, June 4th, 2020, 10:35:15 AM IST

ప్రస్తుత లాక్ డౌన్ సమయాన్ని ఎక్కువగా వినియోగించుకున్న తెలుగు టాప్ ఛానెల్స్ లో జెమినీ టీవీ కూడా ఒకటి. కేవలం ఈ రెండు నెలల వ్యవధిలోనే చాలా కొత్త తెలుగు సినిమాలను ప్రేక్షకులకు అందించారు. అయితే వీరు అనౌన్స్ చేసిన అన్ని సినిమాల్లో కొన్నిటిని మాత్రం ఎందుకో అప్పుడు టెలికాస్ట్ చెయ్యకుండా ఆపేసారు.

అలా ఇప్పుడు మళ్ళీ ఓ సినిమాతో టెలికాస్ట్ చెయ్యడం మొదలు పెట్టారు.టాలీవుడ్ అండర్ రేటెడ్ హీరో శ్రీ విష్ణు హీరోగా నిక్కీ తంబోలి హీరోయిన్ గా కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “తిప్పరా మీసం”.

నిజానికి ఈ చిత్రం ఎప్పుడో టెలికాస్ట్ కావాల్సి ఉంది కానీ అప్పుడు ఆపేసారు. ఇప్పుడు మళ్ళీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చెయ్యనున్నారు. ఈ చిత్రం వచ్చే శనివారం మధ్యాహ్నం 12 గంటలకు టెలికాస్ట్ కానుంది. మరి ఈసారి అయినా కన్ఫార్మో కాదో చూడాలి.