జ్యోతిక సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్.!

Friday, May 29th, 2020, 02:09:29 PM IST


ప్రస్తుతం లాక్ డౌన్ వలన మధ్య తరహా బడ్జెట్ సినిమాలు విడుదల నిలిచిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. దీనితో కొన్ని చిత్రాలు కాస్తా ఓటిటి లోకి వచ్చేస్తున్నాయి. అలా కోలీవుడ్ లో మొట్ట మొదటగా డైరెక్ట్ ఓటిటి లోకి వచ్చిన చిత్రం “పొన్ మగల్ వందల్”.

జ్యోతిక నటించిన ఈ చిత్రం విషయంలో కోలీవుడ్ లో పెద్ద రచ్చే నడిచింది. ఈ సినిమాను కనుక డిజిటల్ వస్తే జ్యోతిక భర్త సూర్య సినిమాలను బాయ్ కాట్ చేస్తామని థియేటర్స్ యాజమాన్యం వారు బెదిరించారు.

అయినప్పటికీ వీరు వెనక్కి తగ్గకుండా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసారు. ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడునా అద్భుతమైన రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది. ఎమోషన్స్, థ్రిల్లింగ్ కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో జ్యోతిక పెర్ఫామెన్స్ హైలైట్ అంటున్నారు.

అలాగే జేజే ఫెడ్రిక్ దర్శకత్వం బ్రిలియంట్ గా ఉందని ఈ చిత్రం చూసిన వారు అంటున్నారు. మరి మీరు కూడా ఈ చిత్రాన్ని చూడాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో ఉంది చూసెయ్యండి.