“ఢీ ఛాంపియన్స్” అసలు పిక్చర్ ముందుంది..!

Sunday, September 15th, 2019, 11:41:39 AM IST

టెలివిజన్ చరిత్రలో ఒక ప్రోగ్రాం నిర్విరామంగా ఒక దశాబ్దం పాటుగా విజయవంతంగా పరుగులు తీసింది అంటే అది ఆశామాషి వ్యవహారం అయితే కాదు.అలాంటిది ఈటీవీలో ప్రసారం అయ్యే కిర్రాక్ డాన్స్ షో ఏకంగా 11 సీజన్లు పూర్తి చేసుకొని గ్రాండ్ గా 12వ సీజన్లోకి అడుగు పెట్టింది.ఇప్పటి వరకు వేలాది డాన్స్ పెరఫామెన్స్ లు,వందల్లో కొరియోగ్రాఫర్లు, పదుల సంఖ్యలో “ఢీ” అనే టైటిల్ విజేతలు.ఇలా ఏ జర్నీ చాలా ఉత్కంఠభరితంగా మాత్రమే కాకుండా వినోదభరితంగా కూడా సాగింది.

ఇటీవలే వారి 11వ సీజన్ అయినటువంటి “ఢీ జోడి” తుది సమరం కూడా ముగుస్తుండడంతోనే తమ తర్వాతి సీజన్ కూడా కేవలం వారంలోనే ప్రేక్షకుల ముందు ఉంచుతామని ప్రకటించారు.ఇప్పుడు దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు.మొట్టమొదటి సారిగా రష్మీ టైటిల్ గెలిచింది,సుధీర్ కూడా మొట్టమొదటి సారి ఓటమి పాలయ్యాడు.

ఇంకేముంది రష్మీ సుధీర్ ను ఒక ఆట ఆడుకుంది.సరికొత్తగా మొదలైన ఈ షోకు న్యాయ నిర్ణేతలుగా శేఖర్ మాస్టర్ మరియు నటి పూర్ణాలు వ్యవహరిస్తుండగా ప్రదీప్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు.ఈ ప్రోమోలో జస్ట్ వీరి ఇంట్రో మాత్రమే ఉంది.ఇప్పటి వరకు 11 సీజన్లనే ఒక రేంజ్ లో తీర్చిదిద్దారు.అలాంటిది ఈసారి ఛాంపియన్స్ ను తీసుకొస్తున్నారు.అంటే ఈ సీజన్ ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.అంటే అసలు పిక్చర్ ముందుంది..

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి