బిగ్ బాస్ 3 : టైటిల్ విన్నర్ గా అతనే పర్ఫెక్ట్ మెటీరియల్!

Thursday, September 19th, 2019, 05:07:30 PM IST

తెలుగులో బిగ్ బాస్ షోకు ఎంతటి ఆదరణ లభించిందో వేరే చెప్పనక్కర్లేదు.అయితే ఇప్పటి వరకు రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు మరింత ఆసక్తికరంగా కొనసాగుతుంది.అయితే ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్ లో మాత్రం ఒక్కరే బిగ్ బాస్ విన్నర్ టైటిల్ కు పర్ఫెక్ట్ మెటీరియల్ అని సోషల్ మీడియా ప్రజానీకం కితాబిస్తున్నారు.అతను మరెవరో కాదు.హీరో వరుణ్ సందేశ్.ఈ సీజన్ మొదలైన ఆదిలో అతనిపై చిన్నగా నెగిటివి మొదలైనా ఆ తర్వాత మాత్రం వరుణ్ ఆట తీరు చూసి బిగ్ బాస్ వీక్షకులు బిగ్ బాస్ టైటిల్ కు అన్ని రకాలుగా అర్హుడని అంటున్నారు.

అసలు ఎలాంటి కాంట్రవర్సీలు కూడా చెయ్యకుండా గేమ్ ను గేమ్ లా ఆడుతూ అందరికి సపోర్టివ్ గా వరుణ్ నిలబెడుతున్నాడని అంతే కాకుండా ఇటీవలే హిమజను సేఫ్ చెయ్యడం కోసం ఇచ్చిన దారుణమైన టాస్క్ ను కూడా ధైర్యం చేసి పూర్తి చేసాడని ఈ ఒక్క టాస్క్ తో వరుణ్ మరో మెట్టు ఎక్కేసాడని బిగ్ బాస్ వీక్షకులు అంటున్నారు.మొత్తంగా మాత్రం బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ గా వరుణ్ సందేశ్ పర్ఫెక్ట్ మెటీరియల్ అని చెప్తున్నారు.మరి వీరు అనుకుంటున్నట్టుగా వరుణ్ టైటిల్ గెలుస్తాడా లేదా చూడాలి.