ఫోన్ లిఫ్ట్ చేసింది…నామినేట్ అయ్యింది..షాక్ లో శ్రీముఖి

Monday, September 16th, 2019, 03:42:53 PM IST

బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ లో శిల్ప చక్రవర్తి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన శిల్ప అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదని వాస్తవం. ఆమె రాక వలన హౌస్ లో గేమ్ అనేది ఆసక్తికరంగా మారిపోతుందని అందరు అనుకున్నారు, కానీ ఆమె వలన ఎలాంటి యూజ్ లేదని మొదటి వారంలోనే తేలిపోయింది. దీనితో తన సెకండ్ వీక్ లో ఎలిమినేషన్ కి వచ్చిన మొదటిసారే ఆమె వెళ్ళిపోయింది.

ఇక ప్రతి సోమవారం హౌస్ లో ఎలిమినేషన్ కోసం నామినేట్ జరుగుతుంది. ఒక్కో వారం ఒక్కో విధంగా నామినేషన్ పక్రియ కొనసాగుతుంది. ఈ వారం కూడా సరికొత్తగా నామినేషన్స్ జరిగినట్లు మనకి ప్రోమోస్ చూస్తే అర్ధం అవుతుంది. హౌస్ లోని గార్డెన్ ఏరియాలో ఒక టెలిఫోన్ బాక్స్ ఉంటుంది. అది రింగ్ కావటంతో శ్రీముఖి వచ్చి దానిని లిఫ్ట్ చేస్తుంది. దీనితో బిగ్ బాస్ మాట్లాడుతూ ఫోన్ లిఫ్ట్ చేసిన కారణంగా శ్రీముఖి మీరు నేరుగా నామినేట్ అయ్యారని చెప్పాడు దీనితో శ్రీముఖి బిత్తరపోయింది.

అయితే శ్రీముఖి ఒక్కదాని విషయంలోనే ఇలాంటిది జరిగిందా..? లేక మిగిలిన హౌస్ మేట్స్ ని కూడా ఇలాగే బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడా..? అనేది మాత్రం ఈ రోజు ఎపిసోడ్ చూస్తే కానీ అర్ధం కాదు. ఇప్పటికే 55 రోజులకి పైగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ లో 10 మంది మాత్రమే మిగిలారు. రాబోవు మూడు నాలుగు వారాలు షో అనేది మరింత రక్తికట్టటం ఖాయమని తెలుస్తుంది.