“గద్దలకొండ గణేష్” ను అందుకోలేకపోయిన “సైరా”

Friday, January 24th, 2020, 11:05:22 AM IST

పండుగ సీజన్ వచ్చింది అంటే ఒక పక్క థియేటర్లు మరియు ఇళ్లల్లో బుల్లి తెరలు సరికొత్త సినిమాలతో నిండిపోతాయి అన్న సంగతి అందరికి తెలిసిందే.అలా ఈసారి సంక్రాంతికి మన తెలుగు ఛానెల్స్ కూడా పలు సరికొత్త సినిమాలను కూడా తెలుగులో టెలికాస్ట్ చేసారు.వాటిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన హిస్టారిక్ పీరియాడిక్ చిత్రం “సైరా నరసింహా రెడ్డి” ఈ చిత్రాన్ని జెమినీ టీవీ వారు అలాగే ఇదే మెగా కాంపౌండ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం “గద్దలకొండ గణేష్” చిత్రాన్ని స్టార్ మా ఛానెల్ వారు ప్రసారం చేసారు.

అయితే రెండు రోజుల గ్యాప్ తో టెలికాస్ట్ కాబడిన ఈ రెండు చిత్రాలలో సైరా చిత్రానికి మాత్రం ఊహించిన స్థాయి టీఆర్పీ రేటింగ్ రాకపోవడం ఆశ్చర్యకరం.ఇదే అనుకుంటే టెలివిజన్ వ్యూవర్ షిప్ పాయింట్స్ విషయంలో అయితే అత్యధికంగా సైరా కంటే గద్దలకొండ గణేష్ చిత్రానికే వచ్చినట్టు తెలుస్తుంది.సైరా చిత్రానికి 87 లక్షల 41 వేల టీఆర్పీ ఇంప్రెషన్స్ రాగా గద్దలకొండ గణేష్ చిత్రానికి మాత్రం 91 లక్షల 25 వేలు ఇంప్రెషన్స్ పడినట్టు తెలుస్తుంది.మొత్తానికి మాత్రం పెదనాన్నను వరుణ్ తేజ్ బుల్లి తెర మీద దాటేసాడని చెప్పాలి.