సుధీర్ మొట్టమొదటి జీతం 93 రూపాయలే..ఎలా సంపాదించాడో తెలుసా!

Tuesday, December 10th, 2019, 11:52:33 AM IST

స్మాల్ స్క్రీన్ పై ఇప్పుడు సుడిగాలి సుధీర్ ఒక స్టార్.ఈటీవీలో ప్రసారాం అయ్యే “జబర్దస్త్” అనే ప్రోగ్రాం ద్వారా కమెడియన్ గా ఎదిగి ఇప్పుడు హీరోగా మారాడు.అయితే ఎన్నో షోలు సినిమాలు చేసిన సుధీర్ తానుగా సంపాదించిన మొట్టమొదటి జీతం ఎంతో తెలుసా కేవలం 93 రూపాయల 75 పైసలు సంపాదించానని “ఆలీతో సరదాగా” ప్రోగ్రాంలో తెలిపారు.ఎన్నో కళల్లో సుధీర్ కు ప్రావిణ్యం ఉందని అందరికి తెలుగు ప్రేక్షకులు అందరికి తెలిసిందే.

అలాంటి వాటిలో సుధీర్ ఒక మంచి మెజీషియన్ అని కూడా అందరికి తెలుసు.అలా తాను స్కూల్ చదువుతున్న సమయంలో నేర్చుకున్న చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్స్ నే ఓ వేరే స్కూల్ లో చెయ్యగా మొట్టమొదటగా ఆ 93 రూపాయల 75పైసలు సంపాదించానని అలా సంపాదించిన ఆ డబ్బులను ఒక నటరాజ్ బాక్స్ లో పెట్టుకొని రిక్షాలో ఇంటికి వెళ్తే ఎక్కడ అందులో డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో అని నడుచుకుంటూ వెళ్లి తాను మొదటగా సంపాదించిన ఆ డబ్బులను తన తండ్రికే మొట్ట మొదటి సారిగా ఇచ్చానని సుధీర్ తన జ్ఞ్యాపకాలను పంచుకున్నాడు.