ఆ హీరోయిన్ కు శ్రీకాంత్ అన్నయ్య ఎలా అయ్యారు?

Tuesday, June 11th, 2019, 11:47:06 AM IST

ఈటీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే అనేక షోలలో కుటుంబం అంతా కలిసి చూడదగ్గ మరో షో ఏదన్నా ఉంది అంటే అది ప్రముఖ నటుడు కమెడియన్ ఆలీ వ్యాఖ్యాతగా నిర్వహించే “ఆలీతో సరదాగా” అనే చెప్పాలి. ఎంతో మంది ప్రముఖ నటులు ఈ షో ద్వారా తమ జీవితాల్లో ఎదుర్కున్న మంచి చెడులను పంచుకున్నారు. ఆనందంగా ఎమోషనల్ గా సాగే ఈ షో కు గత సోమవారం ప్రముఖ హీరోయిన్ సంగీత ముఖ్య అతిధిగా విచ్చేసి ఎన్నో అనుభూతులను పంచుకున్నారు.అయితే సంగీత “ఖడ్గం” సినిమా నుంచి అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారారని చెప్పాలి.

ఆ తర్వాత హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో కనిపించారు.కానీ తాను హీరోయిన్ గా శ్రీకాంత్ హీరోగా వీరి కాంబినేషన్ లో మొత్తం 5 సినిమాలు వచ్చాయి.కానీ శ్రీకాంత్ మాత్రం తనకి అన్నయ్య అని సంగీత తెలిపారు.తాను అసలు శ్రీకాంత్ ను అన్నయ్యగా ఎందుకు పిలుస్తానో కూడా వివరణ ఇచ్చారు. తాను టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసినా సరే శ్రీకాంత్ లాంటి హీరోను ఎక్కడా చూడలేదని,ఆయన తీసుకునే కేరింగ్ చాలా నచ్చుతుందని నిజ జీవితంలో తనకి ఇలాంటి అన్నయ్య ఎవరు లేరని అందుకే శ్రీకాంత్ తో హీరోయిన్ గా అన్ని సినిమాలు చేసినా సరే తనకి ఆయన అన్నయ్య లాగే అనిపిస్తారని తెలిపారు.జూన్ 10 సోమవారం రోజున టెలికాస్ట్ అయిన ఈ పూర్తి ఎపిసోడ్ ను చూడాలనుకుంటే ఈ కింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి చూడండి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి